ASR: ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మలో సోమవారం ప్రారంభమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఫేషియల్ హాజరు విధానం శ్రామికులకు సమస్యగా మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేసినప్పటికీ మొబైల్ యాప్లో ముఖచిత్రం నమోదు కావడం లేదని శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు. హాజరు నమోదు కాకపోవడంతో ఒకరోజు వేతనం నష్టం వాటిల్లిందని తెలిపారు.