NZB: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బాల్కొండ మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సిందూజ (జ్యోతిరావు పూలే), శ్రీనిత్య (సావిత్రిబాయి పూలే) వేషధారణలో అలరించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం పూలే దంపతులు సమాజం కోసం చేసిన త్యాగాలను, విద్యారంగంలో వారు చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు.