KMM: మధిరలో రైల్వే అండర్పాస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం రూ.34 కోట్లు కేటాయించడంపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం పట్టణ అధ్యక్షుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యదర్శి రామిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర పథకాలతో మధిర అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.