AP: పులివెందులలో అల్లర్లకు పాల్పడిన నిందితులతో పోలీసులు సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయించారు. పూల అంగళ్ల కూడలి నుంచి పాత బస్టాండు వరకు వారిని నడిపించుకుంటూ తీసుకెళ్లారు. పాత కక్షలతో జగదీష్ అనే వ్యక్తిపై మద్యం మత్తులో దాడి చేసిన తిరుపాల్, రౌడీషీటర్ విక్రమ్ సహా పలువురిపై కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని DSP మురళీనాయక్ హెచ్చరించారు.