చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై CSK 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై, 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన DC, నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయి ఓటమి పాలైంది.