ప్రపంచవ్యాప్తంగా ధనిక, పేద దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నట్లు ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ సహాయం తగ్గడం, అమెరికా విధిస్తున్న అధిక టారిఫ్లు(9%-28% కి పెరుగుదల) ఇందుకు ప్రధాన కారణాలు. ముఖ్యంగా 25 దేశాలు పేద దేశాలకు ఇచ్చే సాయాన్ని తగ్గించగా, అమెరికా ఏకంగా 59% కోత విధించింది. దీంతో 2030 లక్ష్యాల సాధన సవాలుగా మారింది.