TG: తెలంగాణ భవన్లో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే చిత్రపటానికి నివాళులర్పించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆయనకు ‘భారతరత్న’ ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా విద్య, సమసమాజ స్థాపనకు పూలే చేసిన కృషి అనన్యమని కొనియాడారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం కేసీఆర్ గతంలోనే తీర్మానం చేశారని గుర్తుచేశారు.