IPL 2026లో తొలి విజయం కోసం శ్రమిస్తున్న కోల్‌కతాకు అదిరిపోయే గుడ్ న్యూస్. శ్రీలంక స్టార్ బౌలర్ మతీష పతిరణ గాయం నుంచి కోలుకోవడంతో పాటు ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడు. దీంతో అతనికి IPL ఆడేందుకు లంక NOC జారీ చేసింది. ఈ మేరకు అతను గుజరాత్ మ్యాచ్(ఏప్రిల్ 17) నాటికి జట్టుతో చేరనున్నాడు. అయితే 19న రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.