SRD: ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన కర్ర మమత కాలేజ్ టాపర్ గా నిలిచారు. ఈ మేరకు 993 మార్కులు సాధించి తన ప్రతిభను చాటింది. అత్యధిక మార్కులు సాధించిన ఈమెకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, మమతకు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల బోధన సామర్థ్యం వల్లనే మంచి మార్కులు సాధించానని మమత తెలిపింది.