TG: తమ సమస్యలపై చర్చలకు Dy CM భట్టి విక్రమార్క సానుకూలంగా హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టిజన్స్ జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని, త్వరలోనే చర్చలకు సమయం కేటాయిస్తామని Dy CM భరోసా ఇచ్చారని జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వ హామీపై నమ్మకంతో గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనలను విరమించి, తక్షణమే విధుల్లోకి చేరుతున్నట్లు వారు వెల్లడించారు.