NRML: లక్ష్మణచందా, సోను మండలాల్లో రైతుల సమస్యలు తీవ్రమవుతున్నాయి. వర్షాలు, పందులు, కోతుల బెడదతో ఇప్పటికే నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఇప్పుడు కొత్త సమస్య తలెత్తింది. సరస్వతి డి–17 కాల్వ వద్ద వ్యవసాయ మోటార్ల విద్యుత్ తీగలను దొంగలు కట్ చేసి ఎత్తుకెళ్తుండడంతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. అధికారులు చర్యలు తీసుకుని దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.