AP: గోదావరి పుష్కరాలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పుష్కరాల నిర్వహణపై ప్రణాళికలు సిద్దం చేసినట్లు వెల్లడించారు. రాజమండ్రిలో రూ.9.55 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.