SDPT: హుస్నాబాద్ మండలం కూచనపల్లిలో మర్రి పంపు చెక్ డ్యామ్ ఫీడర్ ఛానల్ శంకుస్థాపన అనంతరం, మంత్రి పొన్నం ప్రభాకర్ పందిల్ల వద్ద ఆగారు. అక్కడ స్వయంగా తాటి ముంజెలను కోయించుకుని తిన్న మంత్రి, వేసవిలో ఇవి శరీరానికి ఎంతో చల్లదనాన్నిస్తాయని కొనియాడారు. ప్రకృతి సిద్ధంగా దొరికే ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.