NRPT: నారాయణపేట ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మురళి భట్టాడ్, అధ్యక్షుడిగా కన్నప్ప కుమార్ శివ ఎంపికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్ బండారి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఈ నూతన కమిటీని సమన్వయంతో ఎన్నుకున్నారు.