VZM: అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెడుతున్నామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అన్నారు. బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంజాయి రవాణా చేసినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి నివారణకు సహకరించాలని కోరారు. బెట్టింగులు వేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.