GDWL: మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన అభిలాషిని ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఆమె సాధించిన విజయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గొప్ప స్ఫూర్తినిస్తోంది. గ్రామానికి చెందిన రాజు గౌడ్ కుమార్తె అయిన అభిలాషిని, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించింది.