MDK: మెదక్‌లోని కేవల్ కిషన్ భవన్లో CPM జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ పరిరక్షణ- సవాళ్లు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అడివయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జిల్లా కార్యదర్శి కే. నర్సమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో పార్టీ నాయకులు కె. మల్లేశం, జె. సంతోష్ కుమార్, యశోద తదితరులు పాల్గొన్నారు.