PDPL: ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ కళాశాల విద్యార్థులు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ చాటారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థిని జీ. సింధూజ 991 మార్కులతో రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం సాధించింది. పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించగా, మొత్తం 75% ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థులను ప్రిన్సిపాల్ అభినందించారు.