ASF: జైనూర్ మండలంలో PDS రేషన్ బియ్యం అక్రమ నిల్వపై బుధవారం తెల్లవారుజామున పలు దుకాణాలలో తనిఖీలు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు. గోపాల్, రాజేశ్వర, జనతా కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేయగా 64 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. అదనంగా 130 కిలోల బెల్లం, 92 కిలోల పటిక పట్టుబడింది. ముగ్గురు వ్యాపారులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.