MNCL: కాసిపేట మండలం దేవాపూర్కు చెందిన దామోదర్ కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిమెంట్ కంపెనీలో పనిచేసే ఆయన, సోమవారం అర్ధరాత్రి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. తెల్లవారితే ఆసుపత్రికి వెళ్దామని భార్య సర్దిచెప్పినా, నొప్పి తాళలేక ఇంటి వెనుక ఉన్న గదిలో ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు SI తెలిపారు.