BDK: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లాలోని పోలీసు అధికారులతో మంగళవారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్లో గల కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎస్పీ పలు కేసులలో సమగ్ర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు.