AP: మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్కు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఆయన కడప జిల్లాలో పర్యటిస్తారు. రేపు ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళతారు.