NGKL: జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నకు వినతి పత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు మాట్లాడుతూ.. మల్టీ పర్పస్ విధానం పేరుతో అక్రమ తొలగింపులు జరుగుతున్నాయని ఆరోపించారు.