సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ మూవీపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన అండర్ వాటర్ సెట్స్‌ను ఇప్పుడు రాజమౌళి తన సినిమా షూటింగ్ కోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం దేవర సెట్స్‌ను రీమోడల్ చేసి షూట్ చేస్తున్నారని టాక్.