TG: సీఎం రేవంత్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు జరగనున్న వేం నరేందర్రెడ్డి రాజ్యసభ సభ్యుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన నరేందర్ రెడ్డి రేపు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.