BDK: బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో రేపు ఉదయం 10 గంటలకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు PACS అధికారులు తెలిపారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని అధికారులు కోరారు.