TG: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించింది. 1000 అద్దె బస్సులను ఔట్ సోర్సింగ్ విధానంలో సిద్ధం చేసింది. మరోవైపు MMTS సర్వీసులు పెంచాలని యోచిస్తోంది. ఫలక్నుమా, నాంపల్లి, లింగంపల్లి, మేడ్చల్, చర్లపల్లి, మల్కాజిగిరి మార్గాల్లో సర్వీసుల సంఖ్య పెంచనుంది.