TG: ప్రధాని మోదీ పర్యటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మే 10న తెలంగాణలో పర్యటిస్తారని స్పష్టం చేశారు. మూడోసారి ప్రధాని అయ్యాక తెలంగాణకు రావడం ఇదే మొదటి సారి. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రైల్వేస్టేషన్లను జాతికి అంకితం ఇవ్వనున్నారు. అనంతరం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో మోదీ సభ ఉంటుందని తెలిపారు.