MHBD: జిల్లా కేంద్రంలోని సాలార్ తండా వద్ద మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ మరమ్మత్తు నేపథ్యంలో ఇవాళ నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ తెలిపారు. త్వరగా మరమ్మత్తు పనులు పూర్తి చేసి యథావిధిగా నీటి సరఫరా కొనసాగిస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.