BDK: ఎక్సైజ్ కేసుల్లో స్వాధీనం చేసిన వాహనాలను ఈ నెల 23న మణుగూరు ఎక్సైజ్ కార్యాలయంలో వేలం ద్వారా విక్రయించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ ప్రక్రియలో ఆసక్తి గల వారు పాల్గొని వాహనాలను పొందవచ్చు. వేలంలో పాల్గొనాలనుకునే వారు నిర్ణయించిన ధరలో సగం మొత్తాన్ని డిపాజిట్ చేయాలని అధికారులు తెలిపారు.