AP: అల్లూరి జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టించింది. దేవీపట్నం మండలం రామదుర్గం కొండపైకి పులి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో కొండపైకి వచ్చే భక్తులను నిలిపివేశారు. పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి, రాత్రిపూట బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు.