అన్నమయ్య: నందలూరు మండల కేంద్రంలోని బస్టాండ్లో జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మాజీ RTC జోనల్ ఛైర్మన్ యెద్దల సుబ్బరాయుడు ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.