KMR: జిల్లాలో జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో మాచారెడ్డి, కామారెడ్డి పట్టణాల్లో నిర్వహించిన దాడుల్లో 9 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 11,340 నగదు, 9 మొబైల్ ఫోన్లు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూదం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామనన్నారు.