VZM: జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెర్లాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిర్వహిస్తున్న రికార్డులను, కార్యాలయ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయ పరిధిలో ఆదాయం తక్కువగా ఉండడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఆదాయం పెరిగేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.