BDK: భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 3, 5, 8వ తరగతుల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా ప్రవేశాలకు ఐటీడీఏ పీవోబీ. రాహుల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 156 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల అభ్యర్థులు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలతో మే 7వ తేదీలోపు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మే14న లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు.