WGL: నర్సంపేట పట్టణంలో బంగారం తాకట్టు టేకోవర్ పేరుతో గాయత్రి బ్యాంకును మోసం చేసిన ఘటనలో మంగళవారం ముగ్గురిపై కేసు నమోదైంది. యూనియన్ బ్యాంకులో తాకట్టు ఉన్న బంగారం రుణాన్ని చెల్లిస్తామని చెప్పి అధికారులు వద్ద నుంచి రూ.5 లక్షలు తీసుకున్నారు. అనంతరం బంగారం ఇవ్వకుండా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.