JN: పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని 4వ అంగన్వాడీ సెంటర్లో మంగళవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్రీ ప్రైమరీ నుంచి ప్రైమరీ స్కూల్కు వెళ్తున్న చిన్నారులకు టీసీలు ఇచ్చి, వారిని ప్రైమరీ స్కూళ్లలో చేర్పించారు. అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షకురాలు మల్లేశ్వరి, ఉప సర్పంచ్ కళ్యాణ్, సెక్రటరీ అంజయ్య, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.