WGL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా మంగళవారం శాయంపేట మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కలెక్టర్ చాహత్ బజ్ పాయ్ సందర్శించారు. పాఠశాలలోని స్టోర్‌రూమ్‌లో నిత్యావసర వస్తువుల నిల్వను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల నిర్వహణపై పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.