SRCL: ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని, చందుర్తి మండలం ఎన్గల్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు శీలం సునీత రాణి, వంగ తిరుపతిలు అన్నారు. మంగళవారం చందుర్తి మండలం ఎన్గల్ గ్రామంలో గ్రామస్తులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి అడ్మిషన్లు ఇచ్చారు.