MHBD: గార్ల మండల కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య సంక్షేమ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 45 మందికి రూ.45 లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులు, రూ.12.78 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.