TG: రైతు జీవితం భూమితో ముడిపడి ఉందని, ఆ భూమిపై హక్కులు స్పష్టంగా ఉన్నప్పుడే జీవితం భద్రంగా ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూభారతి చట్టంలోని రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ నిబంధనను అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా మోటాపురంలో సర్వే మ్యాప్ జత చేసి తొలి రిజిస్ట్రేషన్ జరిగిందన్నారు.