MDCL: మహిళల సాధికారతకు మరొక ముందడుగు వేస్తూ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో 30 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు ప్రత్యేక శిక్షణ అందించారు. నాణ్యమైన వంట, భారీ స్థాయిలో ఆహార తయారీ, హాస్పిటాలిటీ నిర్వహణ, పరిశుభ్రత ప్రమాణాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ శిక్షణ ద్వారా మహిళల్లో నైపుణ్యాలు పెంపొందించి, స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఉన్నారు.