MBNR: వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, పిల్లలు ఈత కోసం చెరువులు, కాలువల వద్దకు వెళ్లకుండా గమనిస్తూ ఉండాలని కోరారు.