KNR: కరీంనగర్లో నెలకొన్న నీటి సమస్యపై పలువురు కాంగ్రెస్ నేతలు మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సెక్రటేరియట్లో కలసి వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన పొన్నం ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి మూడు టీఎంసీల నీరు విడుదల చేస్తామన్నారు.