TG: జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రజలందరికీ ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏడాదిపాటు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. దీనిపై ముసాయిదా ఎంవోయూ పంపించాలని రైల్వేశాఖ కోరింది. రైల్వేశాఖ ఆమోదించగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.