MDK: తూప్రాన్ టోల్గేట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనం పట్టుకున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సామర్థ్యానికి మించి పశువులను తరలిస్తున్న డ్రైవర్, క్లీనర్, యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పశువులను గోశాలకు తరలించినట్లు వెల్లడించారు.