KNR: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి మొత్తం 26 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. నాలుగు పదవులకు జనరల్ విభాగంలో 8 మంది పురుషులు, ఐదుగురు మహిళలు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. మైనారిటీ విభాగంలో 9 మంది పురుషులు, నలుగురు మహిళలు దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియ త్వరలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.