BHPL: సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనతో BRS నేతల్లో వణుకు పుట్టిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లిలో MLA మాట్లాడుతూ… సీఎం పర్యటనకు ముందుగానే BRS నాయకులు మేడిగడ్డకు వెళ్లడం వారి భయాన్ని స్పష్టంగా చూపుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అవినీతి ఆరోపణలు బయటకు వస్తాయనే భయంతో BRS నేతలు గందరగోళానికి గురవుతున్నారన్నారు.