AP: మాజీ సీఎం జగన్ నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శనకు బయలుదేరారు. అక్కడ మత్స్యకారులతో ఆయన సమావేశం కానున్నారు. అయితే, జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. మత్స్యకారులను, మీడియాను హార్బర్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఎవరికీ అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.