WGL: ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఈ నెల 19 నుండి 30 వరకు శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శేషు అన్నారు. ఈ 11 రోజులు ఆలయంలో విశేష పూజలు, కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి కృపకు పాత్రులు కావాలన్నారు.